సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో నిన్న అరెస్టైన అల్లు అర్జున్ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో కాసేపట్లో (ఉదయం 7 గంటలలోపు) ఆయన విడుదల కానున్నారు. బన్నీని రిసీవ్ చేసుకోవడానికి అల్లు అరవింద్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులు జైలు వద్దకు చేరుకుంటున్నట్లు సమాచారం.