జీఎస్టీ వసూళ్లు ప్రతీ నెల కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జూలై నెలకుగాను రూ.1.82 లక్షల కోట్ల వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో వసూలైనదాంతో పోలిస్తే 10% అధికం. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత మూడో అతిపెద్ద వసూలు ఇదే కావడం విశేషం. అలాగే జులైలో మొత్తం రిఫండ్‌లు రూ.16,283 కోట్లుగా ఉన్నాయి. ఇక రాష్ట్రాల్లో మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక, తమిళనాడులు జూలై నెలలో జీఎస్టీని అత్యధికంగా వసూలు చేశాయి.