హోల్‌సేల్ మార్కెట్‌కు పేరుగాంచి నిత్యం కోట్లాది రూపాయల వ్యాపారం జరిగే బేగంబజార్‌లో స్థలాల ధరలు కోట్లు పలుకుతున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న ఫీల్‌ఖానాలో ఇటీవల 101 గజాల పాత ఇంటిని రాజస్థాన్‌కు చెందిన హోల్‌సేల్ కిరాణ వ్యాపారి రూ.10 కోట్లకు కొనుగోలు చేసినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో నగరంలో కోకాపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లతో బేగంబజార్ పోటీపడుతోందని స్థానిక వ్యాపారులు అంటున్నారు.