రెండు రోజుల విరామం తర్వాత బుధవారం మళ్లీ ప్రారంభమైన రైతుల 'ఢిల్లీ చలో' ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కల్పించాలన్న డిమాండ్‌తో ఢిల్లీలో అడుగుపెట్టాలనుకున్న అన్నదాతలను పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. యూపీ, హర్యానా మరియు పంజాబ్ నుండి 1200 ట్రాక్టర్లతో 14,000 మందికి పైగా రైతులు శంభు వద్ద పంజాబ్-హర్యానా సరిహద్దు ప్రాంతానికి చేరుకున్నారు. ఈ నిరసనలో 160 మందికి పైగా అన్నదాతలు గాయపడ్డారని రైతు సంఘం నాయకులు వెల్లడించారు.