ఉదయం ప్రార్థన తర్వాత యూపీ స్కూల్లో ఒక్కొక్కరుగా సొమ్మసిల్లి పడిపోయిన 23 మంది విద్యార్థులు

585చూసినవారు
ఉదయం ప్రార్థన తర్వాత యూపీ స్కూల్లో ఒక్కొక్కరుగా సొమ్మసిల్లి పడిపోయిన 23 మంది విద్యార్థులు
ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట్ లో గల ఓ పాఠశాలలో ఉదయం ప్రార్థనా సమయం తర్వాత కనీసం 23 మంది విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు స్పృహతప్పి పడిపోయారు. "ప్రార్థన చేసే సమయంలో విద్యార్థులు పాఠశాల ఆవరణలో కాస్త ఎక్కువసేపు నిలబడ్డారు. అదే సమయంలో ఎండ ఎక్కువగా ఉండటంతో ఈ ఘటన జరిగింది" అని ప్రిన్సిపల్ రామ్ మిలన్ కుష్వా చెప్పారు. దీంతో వెంటనే విద్యార్థులను ఆరోగ్య కేంద్రానికి తరలించామని తెలిపారు.

సంబంధిత పోస్ట్