భూమిలేని నిరుపేదలకు నగదు బదిలీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. వ్యవసాయ భూమి లేకుండా, కేవలం కూలి పనులతో జీవిస్తున్న అత్యంత నిరుపేదలకు ఆర్థిక సాయం చేసే పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో నిరుపేద కూలి కుటుంబానికి ఏటా రూ.12 వేలు ఇస్తామని, అందులో తొలి విడత రూ.6 వేలను ఈ నెల 28న విడుదల చేస్తామని భట్టి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఏ ప్రాతిపదికన లబ్ధిదారులను ఖరారు చేస్తుందన్నది తెలియాల్సి ఉంది.