33,028 సిమ్‌కార్డులు బ్లాక్‌

72చూసినవారు
33,028 సిమ్‌కార్డులు బ్లాక్‌
సైబర్‌ నేరాల కట్టడికి తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో చర్యలు తీసుకుంది. దాదాపు 33,028 సిమ్‌ కార్డులను బ్లాక్‌ చేయించింది. ఈ బ్యూరో ఏర్పడిన కొద్ది కాలంలోనే ఇంత భారీ సంఖ్యలో సిమ్‌లు పనిచేయకుండా చేసింది. వీటితోపాటు 3,768 ఐఎంఈఐ నంబర్లను సైతం బ్లాక్‌ చేయించింది. ఫ్రీ సిమ్‌.. విత్‌ వన్‌ మంత్‌ అన్‌లిమిటెడ్‌ డాటా లాంటి సిమ్‌లను తీసుకుని చాలా మంది సైబర్‌ నేరగాళ్లు రకరకాల మోసాలకు పాల్పడుతుండడంతో ఈ చర్యలకు ఉపక్రమించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్