బుల్లితెరపై సందడి చేసేందుకు ‘బిగ్బాస్’ వచ్చేస్తున్నారు. త్వరలోనే బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ ఆరో సీజన్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్నీ అధికారికంగా తెలియజేస్తూ తాజాగా ప్రోమో విడుదల చేశారు. ‘లైఫ్లో ఏ మూమెంట్ అయినా బిగ్బాస్ తర్వాతే’. 'బిగ్బాస్ సీజన్ సిక్స్.. ఎంటర్టైన్మెంట్కి అడ్డా ఫిక్స్’ అంటూ నాగార్జున తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. ఈ సీజన్లో ఎవరెవరు పాల్గొంటారో వేచిచూడాలి.