నవంబర్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అలాగే నవంబర్ 12న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముందని అంటున్నారు. అయితే కేవలం 11 సీట్లకు పరిమితమై.. ప్రతిపక్ష హోదా కూడా వైసీపీ సాధించలేకపోయింది. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి తప్ప జగన్ ఇంత వరకు అసెంబ్లీకి హాజరు కాలేదు. మరి ఇప్పుడైనా ఆయన అసెంబ్లీకి వెళ్తారా? లేదా? అనేది చర్చనీయాంశమైంది.