400 ఎకరాల అటవీ భూములను లాక్కున్నారు: పవన్‌ కల్యాణ్

71చూసినవారు
400 ఎకరాల అటవీ భూములను లాక్కున్నారు: పవన్‌ కల్యాణ్
400 ఎకరాల అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చేసి లాక్కున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. పల్నాడు జిల్లా మాచవరంలోని సరస్వతి పవర్‌ భూములను పవన్‌ మంగళవారం పరిశీలించారు. గత ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత సొంతంగా పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు భూములు తీసుకున్నారని పేర్కొన్నారు. ‘ఈ రోజు కోట్ల డబ్బును సొంత ఆస్తిలా భావించి కొట్టుకుంటున్నారు. ఇది ఇక్కడి ప్రజల ఆస్తి. భూములిచ్చిన రైతులకు అండగా ఉంటాం’ అని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్