దేశవ్యాప్తంగా 14.90 లక్షల బీటెక్ సీట్లుండగా.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే 42.80 శాతం ఉండటం విశేషం. గత ఏడాదితో పోలిస్తే దేశంలో సీట్ల సంఖ్య గణనీయంగా పెరగగా.. వాటిలో 3 దక్షిణాది రాష్ట్రాల్లోనే పెరుగుదల అధికంగా ఉన్నట్లు ఏఐసీటీఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 3.08 లక్షల సీట్లతో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా.. 1.83 లక్షలతో ఏపీ రెండో స్థానంలో, 1.45 లక్షల సీట్లతో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచాయి.