నాగ్‌పుర్‌లో 56 డిగ్రీలు నిజం కాదు

63చూసినవారు
నాగ్‌పుర్‌లో 56 డిగ్రీలు నిజం కాదు
మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో గల ఓ వాతావరణ స్టేషన్‌లో నిన్న ఏకంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చూపించింది. దీంతో ప్రజలు హడలిపోయారు. అయితే, అది నిజం కాదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉష్ణోగ్రతను నమోదు చేసే సెన్సర్‌ సరిగా పనిచేయడం లేదని తెలిపింది. ఇటీవల దిల్లీలోని ముంగేష్‌పుర్‌లో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ వాతావరణ స్టేషన్‌లోని సెన్సర్‌ సరిగా పనిచేస్తుందో, లేదో తనిఖీ చేస్తున్నట్లు తెలిపింది.