ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీత రచన పోటీ

82చూసినవారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీత రచన పోటీ
వర్తమాన ఆంధ్రప్రాంత వైభవ స్వాభిమాన గీతాన్ని రూపొందించేందుకు ఐదు నిమిషాల నిడివి గల గీత రచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల కవులు తాము రాసిన గీతాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్‌, నరసాపురం, పశ్చిమగోదావరి జిల్లా అడ్ర‌స్‌కు జూన్ 30 లోగా పంపాలని ఆయన కోరారు. ఎంపికైన గీతానికి రూ.లక్ష బహుమతి ఇస్తామన్నారు.

సంబంధిత పోస్ట్