విశాఖ ప్రజలకు అలర్ట్.. ఇకపై ఆపని చేస్తే రూ. లక్ష జరిమానా..!

79చూసినవారు
విశాఖ ప్రజలకు అలర్ట్.. ఇకపై ఆపని చేస్తే రూ. లక్ష జరిమానా..!
ఆంధ్రప్రదేశ్‌కు ఆయువుపట్టుగా మారబోతుంది సుందరనగరం విశాఖపట్నం. తాజాగా జీవీఎంసీ అధికారులు విశాఖ వాసులకు కీలక అలర్ట్‌ జారీ చేశారు. ఇకపై ఎవరైనా ఆ పనులు చేస్తే.. లక్ష జరిమానా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇకపై ఎవరైనా నగర గోడలపై, విద్యుత్ స్తంభాలు, డస్ట్ బిన్నులపై, ప్రజా ఆస్తులపై పోస్టర్లు అతికించినా, ఇతర రాతలు రాసినట్లయితే 1997 యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం 1 లక్ష రూపాయలు వరకు జరిమానా విధించే అవకాశముంది.