ఎయిరిండియాకు డీజీసీఏ నోటీసులు

51చూసినవారు
ఎయిరిండియాకు డీజీసీఏ నోటీసులు
గంటలపాటు ఎయిరిండియా విమానం ఆలస్యం కావడంతో కనీస సదుపాయాలు కూడా అందుబాటులో లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పందించింది. ఎయిరిండియాకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. ఇటీవల కాలంలో కొన్ని విమానాలు గంటలకొద్దీ ఆలస్యం కావడం, ప్రయాణికులు అసౌకర్యానికి గురైన ఘటనలను డీజీసీఏ నోటీసుల్లో ప్రస్తావించింది. 3 రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్