ఏపీకి కేంద్రం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన(PMGSY)-4 కింద రాష్ట్రానికి 608 రహదారులను మంజూరు చేసింది. PMGSY కింద దేశ వ్యాప్తంగా రూ.70,125 కోట్లతో 62,500KM రహదారుల నిర్మాణం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. మైదాన ప్రాంతాల్లో 500కు పైగా జనాభాగల గ్రామాల్లో, 200కు పైగా ప్రజలున్న గిరిజన కొండప్రాంతాల్లో, 100కు పైగా జనాభా గల మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో కొత్త రోడ్లు వేయనున్నారు.