7 రైల్వేస్టేషన్ల పేర్లు మార్పు

84చూసినవారు
7 రైల్వేస్టేషన్ల పేర్లు మార్పు
ముంబైలోని 7 స్థానిక రైల్వేస్టేషన్ల పేర్లను మార్చే ప్రతిపాదనను మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదించింది. దీంతో ఈ ప్రతిపాదనను రైల్వే మంత్రిత్వశాఖకు పంపనున్నారు. మెరైన్ లైన్‌ను ముంబా దేవిగా, కర్రీరోడ్డును లాల్‌బాగ్‌గా, సాండ్‌హర్ట్స్ రోడ్డును డోంగ్రీగా, చర్ని రోడ్డును గిర్గావ్ స్టేషన్‌గా మార్చనున్నారు. అలాగే కాటన్ గ్రీన్ స్టేషన్‌కు కాలాచౌకీ అని, డాక్‌యార్డ్ రోడ్డును మజ్‌గావ్‌గా, కింగ్ సర్కిల్‌ను తీర్థంకర్ పార్శ్వనాథ్ స్టేషన్‌గా మార్చనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్