ఛత్తీస్‌గఢ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 75 ఏళ్ల వృద్ధుడి కడుపులోని సమస్యకు గురువారం వైద్యులు సర్జరీ చేస్తుండగా.. రోగి పాటలు పాడాడు. ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఆ వృద్ధుడు ఎంతో హుషారుగా ప్రేమ పాటలు పాడుతూ వైద్యులకు సహకరించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.