విఘ్నేశ్వరుడి జన్మదినాన్నే వినాయకచవితిగా జరుపుకుంటాం. భాద్రపద శు
ద్ధ చవితి రోజు.. వినాయకుడి విగ్రహాన్ని భక్తులు ప్రతిష్ఠించి పూజిస్తారు. అయితే ఈసారి సెప్టెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 3.01 గంటలకు చతుర్ది తిథి ప్రారంభమవుతుంది. తర్వాత రోజు అంటే సెప్టెంబర్ 7న సాయంత్రం 5.37 గంటలకు ముగియనుంది. దీంతో వినాయకుడిని సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం ఇంటికి తీసుకురావడం అత్యంత శుభమైన కాలం అని పండితులు చెబుతున్నారు.