14 నుంచి సాగునీటి సంఘాల ఎన్నికలు
AP: ఈ నెల 14 నుంచి సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలోని సాగునీటి సంఘాలకు 14 నుంచి ఎన్నికలు నిర్వహిస్తాం. తుఫాను వల్ల వాయిదా పడ్డ ఈ ఎన్నికలను రీషెడ్యూల్ చేశాం. ఎన్నికల రోజే ఆ సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎన్నికవుతారు. డిసెంబర్ 17న డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు, డిసెంబర్ 20న ప్రాజెక్ట్ కమిటీలకు ఎన్నికలు పూర్తవుతాయి.’ అని తెలిపారు.