బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని హసీనా ప్రసంగాలను నిషేధిస్తూ బంగ్లా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ఐసీటీ) కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాలో చెలరేగిన అల్లర్ల వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి ఆమె కారణమని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆమె ప్రసంగం వల్ల సామాన్యులు ప్రభావితమయ్యే అవకాశముందని భావిస్తున్నట్లు తెలిపింది. తద్వారా మరోసారి అల్లర్లు చెలరేగే ప్రమాదముందని అభిప్రాయపడింది.