సిరియాలోని నాలుగో అతిపెద్ద నగరమైన హమాను తిరుగుబాటుదారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హమా నగరంపై నియంత్రణను కోల్పోయినట్లు సిరియా సైన్యం ప్రకటించింది. నగరాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత జైలు నుంచి వందలాది మంది ఖైదీలను తిరుగుబాటుదారులు విడుదల చేశారు. సిరియా అంతర్యుద్ధం కారణంగా ఇప్పటివరకు 6 లక్షల మందికిపైగా పౌరులు ప్రాణాలు విడిచారు.