అల్లుడు శీను సమయంలో సమంతకు ఒక ఆరోగ్య సమస్య ఏర్పడగా ఆమెకు రూ.25 లక్షలు ఇచ్చానని నిర్మాత బెల్లంకొండ సురేష్ తెలిపారు. 'సమంత చర్మ సమస్య చికిత్స కోసం కొంతమంది నిర్మాతలకు ఫోన్ చేసినా ఎవరూ ఇవ్వలేదు. అప్పుడు నేనే రూ.25 లక్షలు ఆమెకు అప్పుగా ఇచ్చాను. ఆమె బయట ఉంటే ఇబ్బందని, స్టార్ హోటల్లో వసతి ఏర్పాటు చేశా. 4 నెలల్లో సమంత చర్మవ్యాధి నుంచి కోలుకుంది. నేను చేసిన సహాయాన్ని ఆమె ఎప్పటికీ మర్చిపోదు.' అని బెల్లంకొండ అన్నారు.