ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలకు వైద్య విద్యను తాలిబాన్ నిషేధించింది. ఇకపై నర్సింగ్ సహా వైద్య విద్యలో మహిళలు చేరకూడదని ఆదేశించింది. దీనిపై క్రికెటర్లు మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అమ్మాయిలు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని నిరాకరించడం దారుణమని నబీ వ్యాఖ్యానించారు. వారి కలలకు, దేశ భవిష్యత్‌కు ద్రోహం చేయటమేనని మండిపడ్డారు. తాలిబన్ తీసుకున్న ఈ నిర్ణయంపై పునరాలోచించాలని రషీద్ విజ్ఞప్తి చేశారు.