రూ.15 కోట్లు మోసం చేశాడంటూ ధోనీపై ఛీటింగ్ కేసు నమోదు

62చూసినవారు
రూ.15 కోట్లు మోసం చేశాడంటూ ధోనీపై ఛీటింగ్ కేసు నమోదు
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఛీటింగ్ కేసు నమోదైంది. క్రికెట్ అకాడమీ నిర్వహణ విషయంలో ధోనీ తనను రూ. 15 కోట్ల మేర మోసం చేశాడని ఉత్తరప్రదేశ్‌లోని అమేథికి చెందిన రాజేశ్ కుమార్ మౌర్య భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఫిర్యాదు చేశాడు. దాంతో బీసీసీఐ ఎథిక్స్ కమిటీ రూల్ 36 కింద కేసును నమోదు చేసుకొని ఆగస్ట్ 30లోపు వివరణ ఇవ్వాలని ధోనీని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్