జె2-8243 విమానం కూలిపోవడంతో 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించి పలు కుట్రకోణాలు వినిపిస్తున్నాయి. పక్షి తగలడంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగిందని రష్యా ఏవియేషన్ పేర్కొంది. అయితే, ప్రమాద దృశ్యాలను చూసిన నెటిజన్లు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానిని ఉక్రెయిన్ డ్రోన్‌గా భావించడం వల్లే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చివేసినట్లు అనుమానిస్తున్నారు.