నల్లమల అడవిలో చెలరేగిన మంటలు

55చూసినవారు
నల్లమల అడవిలో చెలరేగిన మంటలు
నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అమ్రాబాద్ మండలం నల్లమల అటవీ ప్రాంతంలో మన్ననూర్ వెస్ట్ బీట్ తాళ్లచెల్క, గుండం ఏరియాలో.. సుమారుగా 100 ఎకరాల్లో నిన్న రాత్రి భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మంటలు ఎలా అంటుకున్నాయో తెలుసుకునేందుకు అధికారులు ఆరా తీస్తున్నారు.

ట్యాగ్స్ :