నిద్రలో మీరు గురక పెడుతున్నారా? అయితే మీ సమస్యకు చెక్‌పెట్టే సరికొత్త తలగడ (దిండు) అందుబాటులోకి వచ్చింది. దాని పేరే ‘హూటీ’. గురకను నిరోధించే తర్వాతి తరం తలగడగా చెప్తున్న ‘హూటీ’ ఎలాంటి ఇతర పరికరాల అవసరం లేకుండానే మీతోపాటు మీ పక్కన ఉన్నవారు హాయిగా నిద్ర పోయేందుకు వీలు కల్పిస్తుంది. పవర్ కేబుల్, ట్రావెల్ బ్యాగ్‌తో కలిపి లభ్యమయ్యే ఈ తలగడను ప్రస్తుతం అమెరికా మార్కెట్‌లో 199 డాలర్ల (దాదాపు రూ.16,675) ప్రత్యేక ప్రారంభ ధరతో ప్రవేశపెట్టారు.