కులం, మతం వెల్లడించనివారి వివరాలకు ప్రత్యేక కాలమ్‌!

50చూసినవారు
కులం, మతం వెల్లడించనివారి వివరాలకు ప్రత్యేక కాలమ్‌!
TG: సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా వినియోగించే ఫారాల్లో కులం, మతం వెల్లడించని వారి వివరాల నమోదుకు నో కాస్ట్, నో రిలిజియన్‌ కాలమ్‌లను పెట్టాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని పరిశీలించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఏం నిర్ణయం తీసుకున్నారో పిటిషనర్‌కు సమాచారం అందించాలంది. ఈ మేరకు సంబంధిత కార్యదర్శులకు, బీసీ కమిషన్‌లకు నోటీసులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్