శారీరక వ్యాయామం మెదడును నాడీ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుందని తాజా అధ్యయనం తెలిపింది. వ్యాయామం వల్ల మెదడు పెద్దదవుతుందని పేర్కొంది. వారానికి 2, 3 రోజులు చేసే తక్కువ, అధిక స్థాయి వ్యాయామానికి, మెదడులోని మొత్తం భాగాలకు సంబంధం ఉంటుందని కెనడియన్-అమెరికన్ పరిశోధన బృందం తెలిపింది. అధ్యయనంలో పాల్గొన్నవారి మెదళ్ల MRI స్కాన్లను డీప్-లెర్నింగ్ న్యూరల్ నెట్‌వర్క్ సాయంతో పరిశీలించి ఈ మార్పులను పరిశోధకులు విశ్లేషించారు.