అక్క, 3 నెలల చిన్నారిని హత్య చేసిన యువకుడు

71చూసినవారు
అక్క, 3 నెలల చిన్నారిని హత్య చేసిన యువకుడు
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడు తన అక్క, 3 నెలల మేనకోడలిని హత్య చేశాడు. పర్వీన్ (30) అనే మహిళ ఇంటి ప్రాంగణంలో తన కుమార్తెను ఒడిలో పెట్టుకుని కూర్చుంది. ఈ క్రమంలో ఆమె తమ్ముడు జీషన్ (24) ఏదో విషయంపై గొడవ పడ్డాడు. గొడవ తారాస్థాయికి చేరడంతో మహిళను దుపట్టాతో గొంతు నులిమి హత్య చేశాడు. అదే దుపట్టాతో మూడు నెలల చిన్నారిని కూడా గొంతు నులిమి చంపాడు. ఈ ఘటన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్