ప్రతిష్ఠాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత్ సిద్ధమవుతున్న వేళ మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. టీంఇండియాకు తొలి టెస్టు ఎంతో కీలకమని హర్భజన్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో పిచ్ లు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటాయని తెలిపాడు. విజయావకాశాలు ఇద్దరికీ 50-50గా ఉన్నాయని.. ఒకవేళ తొలి మ్యాచ్ లోనే ఓడితే మాత్రం.. టీంఇండియాకు కష్టాలు మరింత ఎక్కువవుతాయని అన్నారు.