AP: దక్షిణ కాశీగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం పాదగయలో అపచారం జరిగింది. పాదగయ క్షేత్రంలో హోమం జరుగుతున్న సమయంలో హోమగుండంలోకి రసీదు పుస్తకాలను దహనం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో హోమద్రవ్యాలు వేసే పవిత్రమైన హోమగుండంలో ఇలా చేయడం అపచారమంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.