70 ఏళ్లు దాటిన వారికి ఆయుష్మాన్ కార్డులు

66చూసినవారు
70 ఏళ్లు దాటిన వారికి ఆయుష్మాన్ కార్డులు
AP: రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు పరిధిలో లేని 70 ఏళ్లు, ఆపై వయసు కలిగిన సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వీరందరికీ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేయనుంది. రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం కల్పించనుంది. ఆయుష్మాన్ కార్డులు పొందిన వారు దేశంలో ఎక్కడైనా ఉచితంగా చికిత్స పొందవచ్చు. రాష్ట్రంలో 70 ఏళ్లు ఆపై వయసున్న వ్యక్తుల కుటుంబాలు 5.46 లక్షలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్