బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. హనుమకొండలో నిర్వహించిన బీఆర్ఎస్ నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. చేతి గుర్తుకు ఓటేసిన పాపానికి చేతివృత్తిదారుల గొంతు కోశారని విమర్శించారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఏడాది అయిందని అన్నారు. కొత్త పథకాల మాట దేవుడెరుగు.. ఉన్న పథకాలకే పాతరేశారని మండిపడ్డారు.