జీవన్ రెడ్డి అనుచరుడి హత్య కేసులో నిందితుడి అరెస్ట్

80చూసినవారు
జీవన్ రెడ్డి అనుచరుడి హత్య కేసులో నిందితుడి అరెస్ట్
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్య కేసు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంతోష్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారుతో పాటు, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. హత్య గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.