ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. కేటీఆర్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ-రేస్ స్కామ్ నుంచి తప్పించుకొనేందుకే కేటీఆర్ ఢిల్లీ వచ్చారని మండిపడ్డారు. గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. గవర్నర్ అనుమతి నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్ ఢిల్లీ వచ్చారనని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని అంతం చేస్తామన్న కేటీఆర్.. ఇప్పుడు ఆ పార్టీ నేతలను ఎలా కలుస్తున్నారని ప్రశ్నించారు.