హోండా విద్యుత్ వాహన రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. త్వరలో ఓ విద్యుత్ స్కూటర్‌ను లాంచ్ చేయబోతున్నట్లు పేర్కొంటూ ఓ టీజర్‌ను ఇవాళ విడుదల చేసింది. టీజర్‌ను చూస్తే యాక్టివా లుక్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. లుక్ పరంగా పెద్దగా మార్పులేవీ లేకుండానే ఈవీ రూపంలో తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఎంత ధరలో తెస్తారు? రేంజ్ ఎంత ఉండబోతోంది? వంటి వివరాలు తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే.