జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నటుడు, బీజేపీ నాయకుడు మిథున్ చక్రవర్తి పాల్గొన్నారు. నిర్సా అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అపర్ణ సేన్గుప్తాకు మద్దతుగా ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన పర్సును ఎవరో కొట్టేశారు. పర్సు తిరిగి ఇవ్వాలంటూ పార్టీ నేతలు విజ్ఞప్తి చేయగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇదిలా ఉంటే సొంత పార్టీ నాయకులనైనా వదిలిపెట్టండి అంటూ అధికార JMM సెటైర్లు వేసింది.