మెర్సిడెస్ బెంజ్ ఇండియా సరికొత్త ‘ఏఎంజీ సీ 63 ఎస్ ఈ పెర్ఫార్మెన్స్’ కారును విపణిలోకి విడుదల చేసింది. ఎఫ్1 హైబ్రిడ్ టెక్నాలజీతో రూపొందించిన ఈ కారు ధర రూ.1.95 కోట్లుగా సంస్థ తెలిపింది. 2024లో కంపెనీ నుంచి వచ్చిన 24వ మోడల్ ఇది. ఈ కారు గంటకు 0-100 కి.మీ వేగాన్ని కేవలం 3.4 సెకన్లలోనే అందుకుంటుందని తెలిపింది. ఇందులో 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 6.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వంటివి ఉన్నాయి.