డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి తన ఒంటెద్దు పోకడ వీడి గొప్పలు చెప్పడం మానుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్ సంద అశోక్ హితవు పలికారు. వరద సహాయం కింద ఉద్యోగులు మొత్తం కలిసి ఒకరోజు వేతనం కింద రూ. 130 కోట్లు విరాళంగా ఇస్తే అదంతా తన ఘనతే అని చెప్పుకోవడం సరికాదన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భావన్ లో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా లచ్చిరెడ్డి తన పద్ధతి మార్చుకోవాలన్నారు.