స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంపీ, ఎమ్మెల్యే

70చూసినవారు
ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎంపీ నగేష్ తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో ఆదర్శంగా ఉన్నటువంటి దేశం భారతదేశం అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you