ఆదిలాబాద్ పట్టణ ముఖచిత్రాన్ని మార్చే మాస్టర్ ప్లాన్ మళ్లీ తెరపైకి వచ్చింది. అమృత్ 2. 0 పథకం కింద 'అర్బన్ తెలంగాణ - అభివృద్ధి నమూనా' పేరుతో పురపాలికలకు బృహత్ ప్రణాళిక 2050 తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాత ముసాయిదా సవరించి మరోసారి ప్రభుత్వ శాఖలు, వివిధ వర్గాల ప్రజలతో సమావేశమై వారి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరించి మళ్లీ ముసాయిదాను తయారు చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపించనున్నారు.