డీఎస్సీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

78చూసినవారు
డీఎస్సీ 2024కి సంబంధించి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మెసేజ్ లు, ఈమెయిల్ సమాచారం వచ్చిన అభ్యర్థులు తమ ధ్రువపత్రాల పరిశీలనకు డైట్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు వారి ధృవపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ప్రక్రియను డిఇఓ ప్రణీత పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.