ప్రపంచంలోని ప్రతి ఒక్క వ్యక్తికి గాంధీయిజం ఒక పాఠంగా మారిపోయింది. నేటి పాలకులు, ప్రజలకు గాంధీజీ సిద్ధాంతాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా మారిపోయాయి. సత్యం, అహింస అనే ఆయుధాలతో గాంధీజీ ప్రపంచానికి కొత్త దారి చూపి మహాత్ములయ్యారు. మనం ఎప్పుడైతే గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలను పాటిస్తామో, అప్పుడే ఆయన ఆశయాలను నెరవేరుస్తామో.. అప్పుడే తనకు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుంది.