అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని ప్రతీ ఏడాది అక్టోబర్ 2వ తేదీన జరుపుకుంటారు. భారత స్వాతంత్య్ర సమరయోధుడైన మహాత్మాగాంధీ పుట్టినరోజు సందర్భంగా అహింసా దినోత్సవాన్ని జరుపుకుంటారు. అహింసతో భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన గాంధీజీ ఆదర్శాలను ఈనాటి యువతరానికి తెలియజేసేందుకు అహింసా దినోత్సవాన్ని జరుపుతున్నారు. హింస లేకుండా వివాదాలను పరిష్కారం జరిగేలా యువతను ప్రోత్సహించేందుకు, ఆ దిశగా జ్ఞానాన్ని పెంపొందించేందుకు ఈరోజు అనేక కార్యక్రమాలు జరుగుతాయి.