వాంకిడి మండలంలోని దాబా అటవీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం పశువుల మందపై పెద్దపులి దాడిచేసి ఐదు పశువులను గాయపర్చింది. మేతకు వెళ్లిన పశువుల మందపై ఒక్కసారిగా పులి దాడి చేయడంతో స్థానికులు గమనించి పెద్దగా కేకలు వేయడంతో పులి పరారైంది. కానీ అప్పటికే బండకాసా, దాబా గ్రామాలకు చెందిన ఐదు పశువులపై పెద్దపులి దాడి చేసి గాయపర్చింది. సమాచారం మేరకు అసిఫాబాద్ రేంజ్ ఆఫీసర్ గోవింద్ సింగ్ సర్దార్ గాయపడిన ఐదు పశువులను పరిశీలించి ప్రథమ చికిత్స చేయించారు.