రెబ్బెన: రైల్వే ట్రాక్‌పై యువతి మృతదేహం
ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని పుంజు మెరుగూడ గ్రామ శివారులోని రైల్వే ట్రాక్ పై ఆదివారం యువతి మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన కోట సింధుగా గుర్తించి కేసు నమోదు చేసి మృతికి గల కారణాలపై రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు. స్థానికులు మాత్రం ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.