Oct 17, 2024, 00:10 IST/
గ్రూప్-1 అభ్యర్థులను కలుస్తా: KTR
Oct 17, 2024, 00:10 IST
తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఒకే ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు ఆయన మద్దతు ప్రకటించారు. గురువారం HYDలోని అశోక్ నగర్ లేదా తెలంగాణ భవన్ లో వారిని కలుస్తానని Xలో ట్వీట్ చేశారు. మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని, అరెస్టు చేసిన అభ్యర్థులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.