అంధకారంలో గ్రామం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం కోబ్బాయి గ్రామపంచాయతీ ఉపాశనాల గ్రామంలో గత ఆరు సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. గ్రామంలో ఇంటి పన్నులు మాత్రం వసూలు చేస్తున్నారు. గ్రామ సమస్యలు గతంలో ఉన్నటువంటి సర్పంచ్, ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల ఎంపీడీవో దృష్టికి పలుమార్లు తీసుకువెళ్ళిన పట్టించుకోవడం లేదు. అలాగే గ్రామంలో కరెంటు సౌకర్యం లేక గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కావున దయచేసి అధికారులు గ్రామం పైన దృష్టి సారించి గ్రామానికి కరెంటు, రోడ్డు మరమ్మతులు, మురికి కాలువలు ఏర్పాటు చేయాలని జేసీ సంధ్యారాణి కి గ్రామస్తులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సందీప్ ఠాక్రే, సీతారాం, నాందేవ్, జగన్నాథ్, లాలూ భాయి, అంబాబాయి, రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.